![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -501 లో.....రామరాజుని నర్మద తన స్కూటీపై ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వెళ్తుంది. మరొకవైపు డ్యాన్స్ ప్రోగ్రాం కోసం ఒకతను డ్యాన్సర్ ఫొటోస్ చూస్తూ ఉంటాడు. ఈ అందాలు సరిపోవు సిటీలో ఉన్నవారి కంటే విలేజ్ లో ఉండేవారు చాలా అందగా ఉంటారు.. వాళ్ళకి తెలిసేలా ప్రమోషన్ చేయించండి.. పదిలక్షలు ప్రైజ్ అని చెప్పండి. అప్పుడు అందరు వస్తారు.. అందులో నాకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటానని డాన్స్ ప్రోగ్రాం హెడ్ తన అసిస్టెంట్ కి చెప్తాడు. ఆ తర్వాత ధీరజ్ కి సహాయంగా ఉండడానికి దేవుడు నాకు ఏదో ఒక రూపంలో అవకాశం ఇస్తే బాగుండు అని ప్రేమ అనుకుంటుంది. మరొకవైపు నర్మదకి రామరాజు గొడుగుపడతాడు. అదంతా వల్లి, సుకన్య చూసి కుళ్ళకుంటారు. వేదవతి చూసి అమ్మా.. మావయ్య ని కోడలు స్కూటీపై తీసుకొని వచ్చిందని మురిసిపోతుంది. మీకు కోపం పైకి కన్పిస్తుంది మనసులో ఏం పెట్టుకోరని రామరాజుతో వేదవతి అంటుంది. మావయ్యని కొడలు తీసుకొని వస్తుందని ఎంత మంది కన్ను పడిందో ఏంటో అని నర్మదకి వేదవతి దిష్టి తీస్తుంది.
ఆ తర్వాత రామరాజు ఇంట్లోకి వెళ్ళాక ఇంత కష్టపడి ఇంట్లో అడ్డుగీత గీస్తే ఇలా అది చేరిపేసి నర్మద స్కూటీపై వస్తారా అని రామరాజుతో వల్లి అంటుంది. అదేంటే అలా అంటున్నావ్ నువ్వు కష్టపడి గీత గీయడం ఏంటని రామరాజు అనగానే వల్లి కవర్ చేస్తుంది. ఆ తర్వాత నా కొడుకు తండ్రిపరువు రోడ్డుకి ఈడ్చాడు కానీ కోడలు.. అలా కాదు మావయ్య కాసేపు రోడ్డు మీద నిలబడితే చూడలేక తీసుకొని వచ్చింది నా కోడలు అని రామరాజు గొప్పగా చెప్తుంటే నర్మద మురిసిపోతుంది. రామరాజు వెళ్ళిపోయాక ఏంటే ఈ పుల్లలు పెట్టె ప్రోగ్రాం.. ఇంకొకసారి ఇలా చేశావంటే మీరు చేసిన పనులన్నీ మా అయనతో చెప్తాను అని వల్లి కీ వెధవతి వార్నింగ్ ఇస్తుంది.
ఆ తర్వాత వల్లి అక్క చాలా మంచి పని చేసింది సన్మానం చెయ్యాలని ఏదో ఒక రోజు ప్లాన్ చెయ్యాలని ప్రేమ, నర్మద తనతో అంటుంటే తనకి భయం వేస్తుంది. మరొకవైపు తిరుపతి మిల్ కి వెళ్లి డబ్బు టేబుల్ పై పెట్టి చందుకి డబ్బు అక్కడ పెట్టానని చెప్తాడు. ఆ లోపు ఆనందరావు వచ్చి అందులో కొంచెం డబ్బు తీస్తాడు. చందు వచ్చి డబ్బు లెక్కపెడుతుంటే తక్కువ వస్తుంది. అదే విషయం తిరుపతికి చెప్తాడు. ఆ లోపు ఆనందరావు వచ్చి డబ్బు తక్కువగా రావడం నువ్వు ఏమైనా తీసావా అని తిరుపతిని అనగానే మామయ్య అని ఆనందరావుపై చందు కోప్పడుతాడు. ఏమైందో నేను చూస్తానని చందు అంటాడు. మనపై ఏ డౌట్ రాలేదని ఆనందరావు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |